పయనించే సూర్యుడుD.6.10.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్.నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. భీమ్‌గల్ పోలీస్ స్టేషన్ వద్ద ఆత్మహత్యాయత్నం చేసి చికిత్స పొందుతూ మృతి చెందిన హోటల్ నిర్వాహకుడు సుధాకర్ మృతికి పోలీసులే కారణమంటూ బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు.భీమ్‌గల్ పట్టణానికి చెందిన హోటల్ నిర్వాహకుడు సుధాకర్… నిన్న భీమ్‌గల్ పోలీస్ స్టేషన్ వద్ద కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.తీవ్రంగా గాయపడిన సుధాకర్‌ను పోలీసులు వెంటనే నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు మృతి చెందారు.సుధాకర్ హోటల్‌ను రాత్రి 10 గంటల తర్వాత కూడా తెరిచి ఉంచారనే కారణంతో పోలీసులు కేసు నమోదు చేశారని బీజేపీ నాయకులు తెలిపారు. కోర్టుకు హాజరు కావాలంటూ పోలీసులు పిలిచిన నేపథ్యంలోనే ఆయన పోలీస్ స్టేషన్ వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపించారు.
