సినిమా వార్తలు

దుర్గామాత ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి

దుర్గామాత ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి

*దుర్గామాత ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి*

*ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి*

*పతాంజలి యోగ సెంటర్లో భవాని మాత పూజా మరియు అన్నవితరణరణ కార్యక్రమం*

*అన్నవితరణరణ ఏర్పాటు చేసిన మాజీ సర్పంచ్ యారం శేఖర్ రెడ్డి* *హాజరైన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి*

( పయనించే సూర్యుడు అక్టోబర్ 12 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని షాద్ నగర్ పట్టణంలోని పతంజలి యోగ సెంటర్‌లో కొలువుదీరిన భవానీ మాతను ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి దర్శించుకున్నారు.దేవీ నవరాత్రులలో భాగంగా కాకునూరు మాజీ సర్పంచ్ యారం శేఖర్ రెడ్డి ఏర్పాటుచేసిన పూజ మరియు అన్న వితరణ కార్యక్రమానికి ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతి ఇచ్చారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాట్లాడుతూ.. భవానీ మాత అనుగ్రహంతో నియోజక వర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని,దుర్గామాత ఆశీస్సులు అందరిపై ఉండాలని,ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ నవరాత్రులు కొత్త వెలుగులు నింపాలని ఆయన కోరు కున్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అనిత రఘునాథ్ యాదవ్ మాజీ కౌన్సిలర్లు రేటికల్ నందీశ్వర్, యుగంధర్,చెట్ల నర్సింహులు,పాలమాకుల చెన్నయ్య,కంటెస్టెంట్ కౌన్సిలర్లు నక్కల వెంకటేష్,రాజేందర్ సింగ్ ,లింగం దాన సర్పంచ్ నాగిల వెంకటేష్,మాజీ సర్పంచులు తాండ్ర విష్ణువర్ధన్ రెడ్డి,శేఖర్ పంతులు,శ్రీనివాస్ రెడ్డి,ఉపసర్పంచ్ యారం రాంరెడ్డి, నాయకులు శ్రీకాంత్ గౌడ్,దినేష్ సాగర్, భక్తులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS