సినిమా వార్తలు

నాలుగోసారి అయ్యప్ప మహా పాదయాత్రకు శ్రీకారంబాసర నుంచి శబరిమలకు అయ్యప్ప మహా పాదయాత్ర ప్రారంభించిన ముధోల్ శాసనసభ్యులు శ్రీ పవార్ రామారావు పటేల్

నాలుగోసారి అయ్యప్ప మహా పాదయాత్రకు శ్రీకారంబాసర నుంచి శబరిమలకు అయ్యప్ప మహా పాదయాత్ర ప్రారంభించిన ముధోల్ శాసనసభ్యులు శ్రీ పవార్ రామారావు పటేల్

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో బాసర లోకకల్యాణాన్ని ఆకాంక్షిస్తూ బాసర నుంచి శబరిమల అయ్యప్ప స్వామి మహా పాదయాత్ర అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఇందూర్ (నిర్మల్, నిజామాబాద్) ఆధ్వర్యంలో సునీల్ దత్ గురుస్వామి నేతృత్వంలో పాదయాత్ర ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతు అయ్యప్ప స్వాముల మహా పాదయాత్ర నాలుగోసారి విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఎలినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి, అయ్యప్ప స్వామి ఆశీస్సులతో సకాలంలో వర్షాలు కురిసి రైతుల కష్టాలు తొలగిపోవాలని కోరారు , ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, రైతులకు మేలు జరిగి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమోల్ల దత్తాత్రి, ప్రజాప్రతినిధులు, మండల సీనియర్ నాయకులు, అయ్యప్ప స్వాములు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS