రుద్రూర్, పయనించే సూర్యుడు న్యూస్ : రుద్రూర్ గ్రామానికి చెందిన సిరిగంధపు లక్ష్మణ్ చెరువులో పిట్టలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశత్తు చెరువులో పడి మృతి చెందినట్లు ఎస్ఐ రామ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన లక్ష్మణ్ చెరువులో పిట్టలను పట్టడానికి వెళ్లి వారం రోజులు గడుస్తున్న తిరిగి ఇంటికి రాకపోవడంతో మృతుని అన్న సిరిగంధపు నారాయణ మంగళవారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని చెరువులో నుండి బయటకు తీయించి, పంచనామా నిర్వహించారు. మృతుని అన్న సిరిగంధపు నారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.