
పయనించే సూర్యుడు అక్టోబర్ 27 మమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ అమలాపురం: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మున్సిపాలిటీ పరిధిలోని 26వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి దాట్ల వెంకట సుబ్బరాజుకు మద్దతుగా అమలాపురం సుబ్బరాజు అపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు పాల్గొన్నారు. వార్డులో అభ్యర్థికి మద్దతు తెలపాలని ఓటర్లను కోరారు. కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని, కూటమి ప్రభుత్వ హయాంలోనే అమలాపురం అభివృద్ధి సాధ్యమని అన్నారు. 26వ వార్డులో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని, ప్రజల సమస్యల పరిష్కారానికి అభ్యర్థి దాట్ల వెంకట సుబ్బరాజును భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు , కార్యకర్తలతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.