తెలంగాణ

కూటమి గెలుపే ప్రథమ కర్తవ్యం: నీరుకొండ వీరన్న చౌదరి

కూటమి గెలుపే ప్రథమ కర్తవ్యం: నీరుకొండ వీరన్న చౌదరి

రాజానగరం నియోజకవర్గంలో బీజేపీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలి: వీరన్న చౌదరి పిలుపు


పయ నించే సూర్యుడు అక్టోబర్ 27 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ రాజానగరం నియోజకవర్గంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీజేపీ సీనియర్ నాయకులు నీరుకొండ వీరన్న చౌదరి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. మనం కేవలం ఒక పార్టీ కోసం మాత్రమే కాకుండా నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధి కోసం ఏర్పడిన కూటమి విజయానికి కృషి చేయాలని, ప్రతి ఒక్కరూ తమ మండలాలు, గ్రామాలకే పరిమితమై కూటమి తరపున బరిలో నిలిచిన ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపు కోసం చివరి నిమిషం వరకు శ్రమించాలని కోరారు. ఎన్నికల్లో గెలుపు కార్యకర్తల చెమట చుక్కలోనే ఉంటుందని, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు సమన్వయంతో ప్రతి ఇంటి గడపకూ వెళ్లి కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలను, భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికలను ప్రజలకు వివరించాలని సూచించారు. కార్యకర్తల ప్రవర్తన, కష్టపడే తత్వమే రాజకీయంగా గొప్ప భవిష్యత్తును ఇస్తుందని, నిస్వార్థ సేవతో ప్రజల మనసులను దోచుకునేలా పనితీరు ఉండాలని హితవు పలికారు. రాజానగరం గడ్డపై కూటమి జెండా ఎగరాలని, అభ్యర్థుల విజయమే అధినాయకత్వానికి ఇచ్చే అతిపెద్ద బహుమతి కావాలని ఆకాంక్షిస్తూ ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు క్షేత్రస్థాయిలోనే ఉండి ఎలాంటి అలసట లేకుండా కష్టపడాలని కోరారు

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS