ప యనించే సూర్యుడు అక్టోబర్ ఐదు ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనది – ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పరిషత్ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ విప్, ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) దంపతులు గురువారం మురమళ్ల గ్రామంలో తమ ఓటు హక్కును వినియోగించు కున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రజల భవిష్యత్తును నిర్ణయించడంలో ప్రతి ఓటు కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించు కోవాలని, ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఓటు హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన విలువైన హక్కు మాత్రమే కాకుండా ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలకమైన బాధ్యత అని ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు తెలిపారు.
