అశ్వాపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు
పయనించే సూర్యుడు,జూన్02,అశ్వాపురం: మంగళవారం రోజు అశ్వాపురం గ్రామపంచాయతీలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ మరియు తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరాడి అమరులు అయిన అమర వీరులకు నివాళులర్పిండం జరిగింది తర్వాత సర్పంచ్ బానోత్ సదర్ లాల్ జాతీయ జెండా ఎగరవేయడం జరిగింది. సర్పంచ్ బానోత్ సదర్ లాల్ మాట్లాడుతూ తెలంగాణ అమరవీరులు త్యాగాలు ఫలితమే తెలంగాణ, తెలంగాణ అభివృద్ధి కోసం మనమందరం పాటు పడాలి అన్ని అన్నారు,ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తుళ్లూరి ప్రకాష్ రావు,కార్యదర్శి యాకుబ్, వార్డ్ సభ్యులు వేములపల్లి హసీత,మొరివినేన్ని చంద్రకళ, నూకల లింగయ్య, చింతల అనుపమ, శెట్టిపల్లి రమాదేవి, కణతాల ధనలక్ష్మి, గ్రామ పెద్దలు వేములపల్లి రమేష్, అంగన్వాడి టీచర్స్ విజయ, సరళ, భారతి, మల్లికమ్మ మరియు గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది