ప యనించు సూర్యుడు అక్టోబర్ 2 ముమ్మిడివరం ప్రతినిధి అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా అమలాపురం ఆర్యవైశ్య సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాసవి కన్యకా పరమేశ్వరి వైశ్య సంఘ పచ్చిగోళ్ళ జనార్దనరావు కళ్యాణ మండపంలో 80 ఏళ్లు పైబడిన వయోవృద్ధులను సత్కరించారు.ముఖ్య అతిథులుగా డిఎస్పి టిఎస్ఆర్కె ప్రసాద్,రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ కంకటాల రామం,ఉమ్మడి జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు కంచర్ల వెంకట్రావు,మహిళా విభాగ అధ్యక్షురాలు యెండూరి సీతామహాలక్ష్మి పాల్గొన్నారు.ఆర్యవైశ్యుల సేవలను డిఎస్పి కొనియాడారు.అనంతరం దేవగుప్తంలో విద్యుత్ ప్రమాద బాధితుడు సింహాద్రి పద్మనాభంకు దాతల సహకారంతో ఇన్వర్టర్ అందజేశారు.అసోసియేషన్ అధ్యక్షుడు యర్రమిల్లి విశ్వేశ్వరరావు,కార్యదర్శి నూలు సూరిబాబు,కోశాధికారి శ్రీకాకోలపు రాంపండు,వైశ్య సంఘ అధ్యక్షుడు నంబూరు సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.