
పయనించే సూర్యుడుD,13,10,2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్, మంగళవారం రోజున మహిళా వివో నూతన భవన నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి చేపడుతున్న గ్రామ సంఘ భవనాలను త్వరితగతిన పూర్తి చేయాలని పాలకవర్గాన్ని కోరారు.. ఈ భవనానికి స్వచ్ఛభారత్ నిధులతో మరుగుదొడ్ల నిర్మాణానికి మంజూరు ఇస్తామని తెలిపారు.మహిళలు ఆర్థిక అభివృద్ధి తోపాటు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇంకుడు గుంతల నిర్మాణము లో ప్రధాన భూమిక వహించాలని తెలిపినారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ ఏపీవో జీ నర్సయ్య పంచాయతీ కార్యదర్శి తిరుపతి గ్రామపంచాయతీ పాలకవర్గం గ్రామ సంఘం మహిళలు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మరియు కాంగ్రెస్ పార్టీ భీంగల్ మండల అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్ బాల గంగాధర్ కర్ని గంగయ్య భూషణ్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు