తెలంగాణ

దుర్గామాత సన్నిధిలో ఘనంగా మహా అన్నదానం

దుర్గామాత సన్నిధిలో ఘనంగా మహా అన్నదానం

అన్నపూర్ణాదేవి అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారు

పయనించే సూర్యుడు గాంధారి అక్టోబర్ 14/26 గాంధారి మండల కేంద్రంలోని దుర్గా నగర్ కాలనీలో దుర్గామాత 5వ వార్షికోత్సవం సందర్భంగా దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా మహా అన్నదాన కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మంగళవారం అమ్మవారు అన్నపూర్ణా దేవి అవతారంలో భక్తులకు దర్శనమివ్వగా, దుర్గాయూత్ ఆధ్వర్యంలో ఈ మహా అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా అమ్మవారి మాలధారణ దీక్ష తీసుకున్న 100 మందికి పైగా స్వాములకు ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ అన్నదానానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దాదాపు 1000 మంది భక్తులు అమ్మ వారి అన్న ప్రసాదాన్ని స్వీకరించినట్లు యూత్ సభ్యులు తెలిపారు. అమ్మవారి కృపతో ఆకలి తీర్చే అన్నదానం కంటే మించిన సేవ లేదని నిర్వాహకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో దుర్గా యూత్ సభ్యులు శ్రీకాంత్, కృష్ణ, ప్రశాంత్, ఆకాష్, సందీప్, మాలధారణ స్వాములు, దుర్గా నగర్ కాలనీవాసులు కొమ్ముల నర్సింలు, నరేందర్ గౌడ్, రాములు, రమేష్, బాలచందర్ గౌడ్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS