తెలంగాణ

2లక్షల ఎల్‌ఓసీ అందజేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

2లక్షల ఎల్‌ఓసీ అందజేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

పయనించే సూర్యుడుD,14,10,2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ పీకే గంగాధర్,బాల్కొండ నియోజకవర్గం లో వేల్పూర్ మండలంవేల్పూర్ గ్రామానికి చెందిన జంగరాజు గంగాధర్ మయోసైటిస్ వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన వైద్య చికిత్స నిమిత్తం మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని రూ. 2,00,000 (రెండు లక్షల రూపాయలు) విలువైన ఎల్‌ఓసీ (LOC) మంజూరు చేయించారు.ఈ సందర్భంగా ఈ రోజు హైదరాబాద్‌లోని తన నివాసంలో జంగరాజు గంగాధర్ కుటుంబ సభ్యులకు ఎల్‌ఓసీ పత్రాన్ని వేముల ప్రశాంత్ రెడ్డి అందజేశారు.వైద్య చికిత్స కోసం ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి జంగరాజు గంగాధర్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS