*అన్నారం సర్పంచ్ లావణ్య రామకృష్ణ**అన్నారంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రారంభం*
పయనించే సూర్యుడు అక్టోబర్ 15 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )గ్రామ సమగ్ర అభివృద్ధికి తాము నిరంతరం కట్టుబడి ఉన్నామని సర్పంచ్ లావణ్య రామకృష్ణ అన్నారు. అన్నారం గ్రామంలోని 2వ వార్డులో నూతనంగా చేపట్టనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (UGD) నిర్మాణ పనులను సర్పంచ్ లావణ్య రామకృష్ణ బుధవారం అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ… గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని, డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే ఈ పనులను చేపట్టినట్లు తెలిపారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు.హాజరైన ప్రజాప్రతినిధులు అధికారులు:ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ ఓగ్గుల శివశంకర్ యాదవ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి రాఘవేందర్, వార్డు సభ్యులు జి. శ్రీశైలం, సి. యాదయ్య, శ్రీలత, ప్రశాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.