తెలంగాణ

పుష్కర ఘాట్ల అభివృద్ధికి ప్రాధాన్యం – ఎమ్మెల్యే దాట్లగేదెల్లంక ఉత్తరవాహిని పుష్కర ఘాట్ పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు

పుష్కర ఘాట్ల అభివృద్ధికి ప్రాధాన్యం – ఎమ్మెల్యే దాట్లగేదెల్లంక ఉత్తరవాహిని పుష్కర ఘాట్ పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు

పయనించే సూర్యుడు, అక్టోబరు 13: ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ గోదావరి పుష్కరాలను వైభవంగా నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం అధిక మొత్తంలో నిధులు మంజూరు చేసిందని ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. పుష్కర ఘాట్లు, రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో పుష్కర ఘాట్లు, రోడ్ల అభివృద్ధికి రూ.4.88 కోట్లు నిధులు మంజూరైనట్లు తెలిపారు.హినీ ఘాట్ కు సంబంధించి రూ.1.55 కోట్లతో పనులకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. రూ.80 లక్షలతో నిర్మించే పుష్కర ఘాట్, రూ.75 లక్షలతో నిర్మించనున్న రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి అదే గ్రామంలో స్వచ్ఛ రథం ప్రారంభించారు. కుండలేశ్వరం ఏటిగట్టును త్వరలోనే అభివృద్ధి చేస్తామన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి ప్రజా ప్రభుత్వానికి ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో అర్రాని శ్రీనివాసరావు, ఏఎంసీ చైర్మన్ ఓగూరి భాగ్యశ్రీ, వైస్ చైర్మన్ గోలకోట వెంకటరెడ్డి దాట్ల పృథ్వీరాజ్, చెల్లి అశోక్, నాగిడి నాగేశ్వరరావు, తాడి నరసింహారావు, బిజెపి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ, మద్దింశెట్టి పురుషోత్తం, దూడల స్వామినాయుడు, లంకలపల్లి జమీలు, కట్టా సత్తిబాబు, కడలి నాగు, పిల్లి నాగరాజు, కడలి నాగేశ్వరరావు, దాట్ల బాబు, దాట్ల పవన్, గుడ్ల జిమ్మి, గొలకోటి దొరబాబు, పంచాయతీరాజ్ డీఈ వి.రాధాకృష్ణ, హెడ్ వర్క్స్ ఏఈ ఎం.ఈశ్వర్, తాడి జానకీరామ్, గోదా పుండరీక్, పల్లా రాజబాబు,, నాయకులు పాల్గొన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS