పయనించే సూర్యుడుD,15,10,2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్,బాల్కొండ నియోజకవర్గం లో బాల్కొండ మండల కేంద్రంలోవేలాది సంవత్సరాల నుండి ఆధ్యాత్మిక శోభను పంచుతున్న బాల్కొండ మండల కేంద్రంలోని మార్కండేయ మందిర పునర్నిర్మాణం పనుల్లో భాగంగా మొదటి మెట్టుగా దేవాదాయక శాఖ ఇంజనీరు, స్థపతిలు గురువారం ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలోని విగ్రహాలను, పరిసరాలను ఎస్టిమేట్ కోసం కొలతలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం మేరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ నిజామాబాద్ ఏఈ రమేష్ , స్తపతి వెంకటేష్ మార్కండేయ గుడి యొక్క ఎస్టిమేట్ కొరకు ఆలయాన్ని సందర్శించారు. తక్షణమే దేవాదాయశాఖ ఎస్టిమేట్ కు అనుగుణంగా అవసరమైన డిపాజిట్లు చెల్లించాలని వారు సూచించారు. వీరి వెంట బాల్కొండ పద్మశాలి సంఘం అధ్యక్షుడు అంద వెంకటగిరి, కోశాధికారి కుందారపు శ్రీనివాస్,కార్యదర్శి మేక నాగేష్,మైసరి పెద్ద గంగాధర్,భోగ గంగా కిషన్, బోగా భూమేష్ లు ఉన్నారు.