*సినిమాను వీక్షించిన డాక్టర్ చందులాల్ రాథోడ్, జర్నలిస్టు మల్లికార్జున్ నాయక్*
*హాజరైన ప్రముఖులు, లంబాడీ సంఘం ప్రతినిధులు*
పయనించే సూర్యుడు అక్టోబర్ 16 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్)లంబాడీ సమాజ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే ‘గోర్ ఇతిహాస్’ సినిమా షాద్నగర్ పట్టణంలోని సాయిబాబా థియేటర్లో గురువారం ప్రత్యేకంగా ప్రదర్శించారు. మధ్యాహ్నం నిర్వహించిన ఈ ప్రదర్శనలో పలువురు ప్రముఖులు, జర్నలిస్టులు, యువకులు పాల్గొని సినిమాను వీక్షించారు.లంబాడీ సమాజానికి చెందిన చారిత్రక నేపథ్యం, వారసత్వం, సాంస్కృతిక వైభవాన్ని వెండితెరపై ఆవిష్కరించే ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. తమ మూలాలు, సంప్రదాయాలు, పూర్వీకుల చరిత్రను భావితరాలకు పరిచయం చేయడంలో ఇలాంటి చిత్రాలు కీలక పాత్ర పోషిస్తాయని పలువురు అభిప్రాయపడ్డారు.సాయిబాబా థియేటర్లో కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రత్యేక ప్రదర్శనలో డాక్టర్ చందులాల్ రాథోడ్, జర్నలిస్టు మల్లికార్జున్ నాయక్, డైమండ్ శివ, అరవింద్, వెంకట్, శంకర్ నాయక్, పవన్ చౌహన్, శివ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. లంబాడీ సమాజ చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించే ఈ చిత్రానికి ఆదరణ లభించడం పట్ల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు.