ప యనించే సూర్యుడు అక్టోబర్ 15 ముమ్మిడివరం ప్రతినిధిడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గమురమళ్ల: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు సమన్వయంతో పనిచేయాలని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు పిలుపునిచ్చారు. ముమ్మిడివరం నియోజకవర్గంలోని మురమళ్లలో ప్రభుత్వ విప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు కార్యాలయంలో కూటమి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ సానా సతీష్ బాబు, నియోజకవర్గ పరిశీలకురాలు సుంకర పావని, టీడీపీ కోనసీమ జిల్లా అధ్యక్షులు గుత్తుల సాయి, ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, తెలుగుదేశం జిల్లా ఉపాధ్యక్షులు తాడి నరసింహారావు పాల్గొన్నారు. స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, క్షేత్రస్థాయి కార్యాచరణ, గ్రామస్థాయిలో పార్టీ శ్రేణుల భాగస్వామ్యం, కూటమి పార్టీల మధ్య సమన్వయంపై చర్చించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ప్రతి గ్రామంలో కూటమి బలాన్ని పెంచాలని, ఘనవిజయం సాధించడంతో పాటు ఏకగ్రీవాలు సాధించే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.*
