పయనించే సూర్యుడు D. 16.11.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వ అండ డిసిసి అధ్యక్షులు నగేష్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి అండగా నిలవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ఈ నెల 19వ తేదీ నుండి ప్రారంభించడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా రాష్ట్రంలో రాజకీయాలతో సంబంధం లేకుండా, ధనికుడు పేదవాడు అని సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి బీమా అందించడం జరుగుతుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ఒక కోటి 19 లక్షల కుటుంబాలకు, అదేవిధంగా జిల్లాలో మొత్మం 4,51, 088 కుటుంబాలకు భీమా అందుతుంది అని నాగేశ్ రెడ్డి తెలిపారు. దీని ద్వారా కుటుంబ సభ్యులకు భీమ కల్పించడం జరుగుతుంది అన్నారు. రేషన్ కార్డు ఉండి కుటుంబంలో 18 నుండి 59 సంవత్సరాలు ఉన్న వారికి ఈ పథకం వర్తిస్తుంది అని, ఈనెల 19వ తేదీ నుండి రాష్ట్రంలో ఈ పథకం ప్రారంభం అవుతుంది అని తెలిపారు. జిల్లాలో ఉన్న ప్రజలు అందరూ ఈ నెల 19వ తేదీ నుండి నెల 30వ తేదీ వరకు ఈ పథకంలో ఎన్ని రోజులు చేసుకోవాలని అధికారులు గ్రామ గ్రామానికి వచ్చి ఈ పథకాన్ని ఎన్రోల్ చేస్తారని ప్రతి ఒక్కరూ ఇందులో ఎన్రోల్ అవ్వాలని నగేష్ రెడ్డి తెలిపారు. ఈ పథకం ద్వారా కుటుంబంలోని పెద్ద మరణిస్తే ఆ కుటుంబానికి 5 లక్షలు ప్రభుత్వం అందిస్తుంది అన్ని అన్నారు. అధికారులు తమ వద్దకు వచ్చినప్పుడు కుటుంబ పెద్ద వివరాలు మరియు నామిని వివరాలు ఇవ్వాలని ,ప్రభుత్వం చేపట్టే ఈ పథకంలో అందరూ భాగస్వామ్య కావాలని అన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా జిల్లాలో సుమారు 20 వేల పింఛన్లు మంజూరు చేయడం జరుగుతుందని,అందులో వికలాంగులు,ఒంటరి మహిళా,వితంతువుల పింఛన్లు అందిస్తుందని అన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ సంక్షేమ పథకాలు అందించే ప్రక్రియలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలిపారు.