పయనించే సూర్యుడుD.29.09.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్. PDSU ఆధ్వర్యంలో భగత్ సింగ్ 119వ జయంతి సభ అమెరికా ఆధిపత్య ధోరణులు, సామ్రాజ్యవాద యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా దేశంలోని ప్రజాస్వామ్య, ప్రగతిశీల శక్తులు ఐక్యంగా పోరాడాలని PDSU నాయకులు పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణ కేంద్రంలో PDSU (ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం) ఆర్మూర్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో అమరవీరుడు, విప్లవ వీరుడు షాహిద్ భగత్ సింగ్ 119వ జయంతి సభ ఘనంగా కేజీబీవీ బాలికల వసతి గృహం లో నిర్వహించబడింది. భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి పిడిఎస్యు ఆర్మూర్ ఏరియా అధ్యక్షుడు డి.నిఖిల్ అధ్యక్షత వహించగా ముఖ్య వక్తగా సీపీఐ యం యల్ ప్రజాపంథా మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి. దేవారం , PDSU జిల్లా అధ్యక్షుడు యం. నరేందర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తూ, ఆధిపత్యాన్ని చెలాయి స్తున్న అమెరికా యుద్ధోన్మాద విధానాలను తీవ్రంగా నిరసించారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం కాపాడబడాలంటే ప్రజల ఐక్య పోరాటాలను బలోపేతం చేయాలని స్పష్టం చేశారు. భగత్ సింగ్ కేవలం బ్రిటిష్ పాలనపైనే కాకుండా దోపిడీ లేని సమాజం కోసం, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడారని గుర్తుచేశారు. ఆయన చూపిన ధైర్యం, త్యాగం, సామాజిక మార్పు స్ఫూర్తితో నేటి యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.అలాగే కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ, ఫాసిస్ట్ వైఖరికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య శక్తులు ఏకమై ఫాసిజాన్ని తరిమికొట్టాలని కోరారు. రోజురోజుకూ పెరుగుతున్న మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలకు వ్యతిరేకంగా మహిళా లోకం చైతన్య వంతమై పోరాడాలని ఉద్ఘాటించారు. యువత జీవితాలను, భవిష్యత్తును నాశనం చేస్తున్న గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల సంస్కృతికి వ్యతిరేకంగా విద్యార్థి, యువజన లోకం సమరశీల పోరాటాలు నిర్వహించాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యు ఆర్మూర్ ఏరియా ప్రధాన కార్యదర్శి రాజు , ఏరియా నాయకులు వినోద్ , ప్రణయ్ పాల్గొన్నారు..