వైరల్ వార్తలు

రీల్స్ కోసం వచ్చి.. నడిరోడ్డుపై కొట్టుకున్న యువతులు..!(వీడియో చూడండి)

రీల్స్ కోసం వచ్చి.. నడిరోడ్డుపై కొట్టుకున్న యువతులు..!(వీడియో చూడండి)

పయనించే సూర్యుడు న్యూస్ | : ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, సోషల్ మీడియా వ్యామోహం నేపథ్యంలో చిన్నచిన్న విషయాలకే వివాదాలు తలెత్తుతున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా బెంగళూరులోని ప్రముఖ కబ్బన్ పార్క్ పరిసరాల్లో రీల్స్ చిత్రీకరణ విషయంలో ఇద్దరు యువతుల మధ్య మొదలైన వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. చిన్నపాటి గొడవ కాస్తా ముదిరిపోవడంతో ఇద్దరు యువతులు నడిరోడ్డుపైనే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. జుట్టు పట్టుకుని లాగుతూ, పిడిగుద్దులు కురిపించుకుంటూ రోడ్డుపైనే కొట్టుకోవడంతో అక్కడున్న వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. యువతులను విడిపించేందుకు, గొడవను ఆపేందుకు చుట్టుపక్కల ఉన్నవారు ప్రయత్నించినప్పటికీ వారు వెనక్కి తగ్గకుండా పరస్పరం దాడి చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రధాన రహదారిపై కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ ఘటనను అక్కడున్న కొందరు తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించడంతో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బహిరంగ ప్రదేశంలో యువతులు ఇలా పరస్పరం దాడి చేసుకోవడంపై స్థానికులు, నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS