తెలంగాణ

అర్హులను గుర్తించి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు పంపిణీ చేయాలి…

అర్హులను గుర్తించి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు పంపిణీ చేయాలి…

రుద్రూర్, పయనించే సూర్యుడు : రుద్రూర్ మండల కేంద్రంలో అర్హులైన వారికి మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించాలని బీజేపీ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం బీజేపీ పార్టీ కార్యాలయం వద్ద విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా బీజేపి నాయకులు మాట్లాడుతూ.. రుద్రూర్ గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం ఇదివరకే 483 దరఖాస్తులు ఇవ్వగా, తహసీల్దార్ 285 మంది లబ్ధిదారులను ఎంక్వయిరీ చేయగా అందులో 11, 12, 13 గ్రేడ్ గా డివైజ్ చేసిన వాటిలో చాలా అవకతవకలు జరగడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. అసలైన నిరుపేదలను గుర్తించాలన్నారు. ఇల్లు ఉన్నవారు పొలం ఉన్నవాళ్లు చాలా మంది ఉన్నారని వారిని L1, L2 లిస్టులో చేర్చారని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. కావున తహసీల్దార్ ప్రజల ఆరోపణలు పరిగణలోకి తీసుకోని సంబంధిత అధికారులతో ఎంక్వయిరీ చేయించి చాలా కఠినంగా వ్యవహరించి అర్హులైన నిరుపేద కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించి అండగా నిలవాలని భారతీయ జనతా పార్టీ రుద్రూర్ మండలం తరపున డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీజేపీ పార్టీ అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, నాయకులు కటికే రామ్ రాజ్, పటేల్ ప్రసాద్, జిల్లా కౌన్సిల్ మెంబర్ గుండూరు ప్రశాంత్ గౌడ్, అంబం సర్పంచ్ కుర్లేపు గంగాధర్, ఉప సర్పంచ్ రేపల్లి సాయిప్రసాద్, వార్డుమెంబర్ అనిల్,పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS