పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో ప్రజా ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితుడై బిజెపి మండల నాయకుడు బిజెపి పార్టీని వీడి మాజీ శాసనసభ్యులు జి. విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది కుబీర్ మండలంలోని పల్సి గ్రామానికి చెందిన బిజెపి మండల సీనియర్ నాయకుడు రవి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది మాజీ శాసనసభ్యులు గారు వారికి పార్టీ కండువా కప్పి సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాజు లోకేశ్వరం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్త గౌడ్, వార్డ్ మెంబర్ కామాజీ,పాల రాకేష్,తోట రవి,తోట దత్తు,పోతన్న, మాదన్న,సాయినాథ్, పవన్, మాజీ సర్పంచ్ శ్రావణ్, మాజీ సర్పంచ్ దత్తు గౌడ్ మరియు మండల సీనియర్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.