74 పనులకు శంకుస్థాపన-ఎంపీ లాడ్స్ నుండి కోటి రూపాయలతో రోడ్ల నిర్మాణం
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 29,ముమ్మిడివరం ప్రతినిధి,గ్రంధి నానాజీ: ముమ్మిడివరం నగర పంచాయతీ కార్యాలయం వద్ద మంగళవారం ఉదయం 10 గంటలకు కమిషనర్ పి.రవివర్మ అధ్యక్షతన సమావేశం జరిగింది.ఈ సమావేశానికి ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, ఎంపీ గంటి హరీష్ బాలయోగి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి నగర పంచాయతీ అభివృద్ధికి రూ.12 కోట్లు మంజూరు చేశారని,అందుకు సంబంధించి కుప్పం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్ గా శంకుస్థాపన చేశారని తెలిపారు.రూ.12 కోట్లతో వివిధ వార్డులలో చేపట్టే 74 పనులు సిసి,బిటి రోడ్లకు నేడు శంకుస్థాపన చేస్తున్నామని,వాటర్ ప్రాజెక్ట్,డిగ్రీ కాలేజీ,పార్క్ నిర్మాణంతో రెండున్నర సంవత్సరాలలో సుమారు రూ.257 కోట్లతో అభివృద్ధి చేపడుతున్నామని పేర్కొన్నారు.ఎంపీ హరీష్ బాలయోగి మాట్లాడుతూ ఎంపీ లాడ్స్ ద్వారా రూ.కోటితో రోడ్ల నిర్మాణానికి మంజూరు చేశానని,చేసిన అభివృద్ధిని కూటమి నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు గుత్తుల సాయి,మాల కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్,మార్కెట్ కమిటీ చైర్మన్ ఓగూరి భాగ్యశ్రీ,దాట్ల పృథ్వీరాజ్,మాజీ చైర్మన్ గొలకోటి దొరబాబు,తాడి నరసింహారావు,దొమ్మేటి రమణ కుమార్, టౌన్ అధ్యక్షుడు కట్టా సత్తిబాబు,నీటి సంఘం అధ్యక్షుడు సరిపెల్ల శ్రీనురాజు,మాజీ కౌన్సిలర్లు ములపర్తి బాలకృష్ణ,పిల్లి నాగరాజు,జనసేన నాయకులు గోదసి పుండరీష్,గొల్లపల్లి గోపి,ముత్యాల జయలక్ష్మి,కర్రా దుర్గాప్రసాద్,ఏఈ కె.శ్రీనివాస్, జాగు సత్తిబాబు,బడుగు రవి,జనిపల్లి సత్యనారాయణ,ఎస్.సోమయ్య,పితాని రామకృష్ణ,ప్రసాద్,మాదాల నాగసత్య మంగకుమారి, బొక్కా రుక్మిణి,మెండి కమల,కె.మల్లీశ్వరి,పెదపూడి రుక్మిణి,కె.నాని,దాట్ల బాబు,కడలి నాగు,రెడ్డి సుబ్బారావు, వాసంశెట్టి అమ్మాజీ,తాడి జానకిరామ్,నిమ్మకాయల విషు,మాదాల పరంజ్యోతి,కాశి లాజర్,పాయసం చిన్ని,ఏడిద శివ, రామాయణం పల్లంరాజు,ఎస్ఎంఎస్ ప్రసాద్,కాశి రామచంద్రరావు,సానబోయిన నానాజీ,గొవ్వాడ శ్రీనివాసరావు, సానబోయిన లక్ష్మీనారాయణ, మాదాల బాబి, పాయసం చిన్నాజీ, జనసేన, బీజేపీ నాయకులు, ప్రజలు, మెప్మా, సచివాలయం, నగర పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.