పయనించే సూర్యుడు, సెప్టెంబర్ 29 ముమ్మిడివరం ప్రతినిధి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల్లో భాగంగా సేవా సంకల్ప్ అభియాన్ 25 కోట్ల భారతీయ చిన్నారుల కలలు కార్యక్రమం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కాట్రేనికోన శ్రీ వాణి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు తాతపూడి సుబ్బారావు ఆధ్వర్యంలో వక్తృత్వ పోటీలు నిర్వహించారు.సేవా సంకల్ప్ అభియాన్ మండల కన్వీనర్ పివి వి సత్యనారాయణ మాట్లాడుతూ వక్తృత్వ పోటీల ద్వారా విద్యార్థుల్లో వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మోదీ చేపడుతున్న కార్యక్రమాలపై అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు.కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జి,ముమ్మిడివరం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గొలకోటి వెంకటరెడ్డి,బీజేపీ జిల్లా కోశాధికారి గ్రంధి నానాజీ, కెటివి ప్రసాద్,శిష్ట కృష్ణ,టి తంబీ విద్యార్థిని విద్యార్థులుతదితరులు పాల్గొన్నారు.