తెలంగాణ

రక్తదాన శిబిరానికి జనసైనికులు, వీర మహిళలు తరలిరావాలి

రక్తదాన శిబిరానికి జనసైనికులు, వీర మహిళలు తరలిరావాలి

పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 30 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్‌పల్లి నియోజకవర్గంలోని జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళల సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కూకట్‌పల్లి రాందేవ్‌రావు ఆసుపత్రి ఆధ్వర్యంలో, నాలుగో అంతస్తులోని వీకేఆర్ ట్రస్ట్ సహకారంతో ఈ రక్తదాన శిబిరాన్ని అక్టోబర్ 1న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితుల్లో, ప్రమాదాల్లో గాయపడిన వారికి, శస్త్రచికిత్సలు, ప్రసవాల సమయంలో అవసరమైన రక్తం అందుబాటులో ఉండటం ఎంతో ముఖ్యమని తెలిపారు. రక్తదానం ద్వారా అవసరమైన సమయంలో రోగులకు సహాయం చేయవచ్చని పేర్కొన్నారు.కూకట్‌పల్లి నియోజకవర్గంలోని జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, రక్తదానం చేయడానికి అర్హులైన ప్రతి ఒక్కరూ శిబిరంలో పాల్గొని రక్తదానం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. “రక్తదానం చేయండి – ప్రాణదాతగా నిలవండి” అనే సందేశంతో నిర్వహిస్తున్న ఈ శిబిరాన్ని విజయవంతం చేయాలని కోరారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS