క్రైమ్ వార్తలు

వదిన తల నరికి.. రోడ్డుపై తలతో పోలీస్టేషన్ కు నడుచుకుంటూ వెళ్లిన వ్యక్తి (వీడియో చూడండి)

వదిన తల నరికి.. రోడ్డుపై తలతో పోలీస్టేషన్ కు నడుచుకుంటూ వెళ్లిన వ్యక్తి (వీడియో చూడండి)
Screenshot

పయనించే సూర్యుడు న్యూస్ | : పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల బసంతి టౌన్‌లో ఒళ్లు గగుర్పొడిచే ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఒక చేతిలో మహిళ తలను, మరో చేతిలో కత్తిని పట్టుకుని నడుచుకుంటూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నిందితుడిని బిమల్ మండల్‌గా గుర్తించినట్లు సమాచారం. కుటుంబ కలహాల నేపథ్యంలో బిమల్‌కు తన వదినతో తరచూ గొడవలు జరిగేవని తెలుస్తోంది. శనివారం మరోసారి ఇద్దరి మధ్య వివాదం తలెత్తడంతో పరిస్థితి హింసాత్మకంగా మారినట్లు సమాచారం.

వివాదం తీవ్రరూపం దాల్చడంతో బిమల్ తన వదినపై పదునైన ఆయుధంతో దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆమె మృతి చెందిన అనంతరం తలను శరీరం నుంచి వేరు చేసినట్లు పోలీసులు పేర్కొన్నట్లు సమాచారం. అనంతరం తలను ఒక చేతిలో, కత్తిని మరో చేతిలో పట్టుకుని బిమల్ రోడ్డుపై నడుచుకుంటూ పోలీస్ స్టేషన్ వైపు వెళ్లాడు. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురై అక్కడి నుంచి పరుగులు తీశారు. మరికొందరు మాత్రం అతడిని అనుసరిస్తూ ఘటనను తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించినట్లు సమాచారం.

బిమల్ నేరుగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని తన చేతిలో ఉన్న తలను, కత్తిని పోలీసులకు అప్పగించినట్లు తెలుస్తోంది. తానే హత్య చేసినట్లు పోలీసుల ఎదుట వెల్లడించి లొంగిపోయినట్లు సమాచారం. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఘటనకు దారితీసిన పూర్తి కారణాలు, కుటుంబ వివాదం వెనుక ఉన్న పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS