తెలంగాణ

నిర్మల్ జిల్లా కాంగ్రెస్‌ ఎస్సీ డిపార్ట్మెంట్ బలోపేతానికి కృషి చేయాలి

నిర్మల్ జిల్లా కాంగ్రెస్‌ ఎస్సీ డిపార్ట్మెంట్ బలోపేతానికి కృషి చేయాలి

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో నిర్మల్ జిల్లా కాంగ్రెస్‌ ఎస్సీ డిపార్ట్మెంట్ ను క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, నిర్మల్ జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ ఇన్‌చార్జి కుర్మే మహేందర్‌, కో ఆర్డినేటర్ తలారి ఆశన్న పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా నర్సాపూర్ మండల ఎస్సీ డిపార్ట్‌మెంట్ కమిటీ జాబితాను జిల్లా ఎస్సీ డిపార్ట్‌మెంట్‌ ఇన్‌చార్జి కుర్మే మహేందర్‌, కోఆర్డినేటర్‌ తలారి ఆశన్నకు నిర్మల్ జిల్లా ఎస్సీ డిపార్ట్‌మెంట్‌ జనరల్‌ సెక్రటరీ కాల్వ రఘు, నర్సాపూర్ మండల ఎస్సీ డిపార్ట్‌మెంట్‌ అధ్యక్షుడు గడ్డం అశోక్‌ అందజేశారు.సమావేశంలో జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ అధ్యక్షుడు కట్ట శ్యామ్‌ సుందర్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు తూర్పటి వెంకటేష్‌, రాష్ట్ర కార్యదర్శులు కొంతం గణేష్‌, శంకర్‌, సాహెబ్‌రావు, నియోజకవర్గ ఎస్సీ డిపార్ట్మెంట్ అధ్యక్షుడు కత్తి నరేందర్‌ తదితర జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS