తెలంగాణ

స్వచ్ఛతా హి సేవలో భాగంగా “సఫాయి మిత్ర సురక్షా శివిర్”

స్వచ్ఛతా హి సేవలో భాగంగా “సఫాయి మిత్ర సురక్షా శివిర్”

ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎంపీడీవో ముత్యాలరావు

పయనించే సూర్యుడు, అశ్వాపురం, సెప్టెంబర్ 30: అశ్వాపురం గ్రామపంచాయతీ పరిధిలో స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో భాగంగా “సఫాయి మిత్ర సురక్షా శివిర్” కార్యక్రమాన్ని సర్పంచ్ బానోతు సదర్ లాల్ గారి అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ సదర్ లాల్ మాట్లాడుతూ, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికుల పాత్ర ఎంతో కీలకమని, ప్రజల ఆరోగ్యం కోసం వారు ప్రతిరోజూ అంకితభావంతో పనిచేస్తున్నారని అన్నారు. ఎండ, వానలను సైతం లెక్కచేయకుండా పారిశుధ్య నిర్వహణలో వారు అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. పారిశుధ్య కార్మికుల ఆరోగ్యం, భద్రతకు గ్రామపంచాయతీ తరఫున తగిన ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీఓ ముత్యాలరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ పారిశుధ్య నిర్వహణలో పారిశుధ్య కార్మికులు చేస్తున్న సేవలు ఎంతో విలువైనవని అన్నారు. వారి ఆరోగ్య పరిరక్షణతో పాటు పని సమయంలో భద్రతా ప్రమాణాలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు, పారిశుధ్య కార్మికుల సేవలను గుర్తించి, వారికి అవసరమైన సహకారం అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు, అనంతరం పారిశుధ్య కార్మికులకు హెల్త్ చెకప్ నిర్వహించి, శానిటేషన్ కిట్లను అందజేశారు. వారి సేవలను గుర్తించి అభినందించారు, ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తుల్లూరి ప్రకాశరావు, పంచాయతీ కార్యదర్శి యాకూబ్, గ్రామపంచాయతీ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS