బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి
పయ నించే సూర్యుడు అక్టోబర్ 1 ముమ్మిడివరం ప్రతినిధి ప్రజా సేవనే పరమావధిగా భావిస్తూ 25 ఏళ్లుగా ప్రభుత్వ బాధ్యత ల్లో విశిష్ట సేవలు అందిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్ఫూర్తితో నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి కోరారు.. ప్రజల సంక్షేమం, సమాజ సేవ, దేశ ప్రగతి అనే లక్ష్యాలతో సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అధికారాన్ని పదవిగా కాకుండా బాధ్యతగా భావించి ప్రజలకు సేవ చేయాలనే స్ఫూర్తిని ఆచరణలో చూపించిన నరేంద్ర మోదీ ప్రస్థానం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమన్నారు. దేశం కోసం, సమాజం కోసం మన వంతుగా ఏదైనా చేయాలనే ఆలోచన ప్రతి పౌరుడిలో బలపడాలని, సేవా కార్యక్రమాలు కేవలం ఒకరోజు కార్యక్రమాలు గా కాకుండా నిరంతర సామాజిక బాధ్యతగా కొనసాగాలని డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి ఆకాంక్షించారు.పేదలు, బలహీన వర్గాలు, మహిళలు, యువత, రైతులు, నిరుపేద కుటుంబాలకు అండగా నిలవడం, అవసరమైన వారికి సహాయం అందించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, రక్తదానం, వైద్య సేవలు, విద్యా సహాయం వంటి అనేక కార్యక్రమాల ద్వారా సేవా భావాన్ని సమాజంలో మరింత విస్తరించవచ్చని ఆయన తెలిపారు. సేవా సంకల్ప్ అభియాన్ ద్వారా ప్రతి గ్రామం, ప్రతి వార్డు, ప్రతి కుటుంబానికి సేవా స్ఫూర్తి చేరేలా కార్యకర్తలు, ప్రజలు కలిసి పనిచేయాలని ఆయన కోరారు. అలాగే సమాజంలో మార్పు తీసుకురావడానికి పెద్ద కార్యక్రమాలే అవసరం లేదని, ప్రతి వ్యక్తి తన పరిధిలో ఒక మంచి పని చేయడం ద్వారా గొప్ప మార్పునకు నాంది పలకవచ్చన్నారు. “ప్రజలకు సేవ చేయడం అంటే దేశానికి సేవ చేయడమే. సేవా భావంతో వేసే ప్రతి అడుగు సమాజ ప్రగతికి బాటలు వేస్తుంది. నరేంద్ర మోదీ సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగస్వాములు కావాలి” అని డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు.