
ప యనించే సూర్యుడు అక్టోబర్ 1 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ప్రజల అవసరాలకు అనుగుణంగా ఎంపీ నిధులతో అభివృద్ధి పనులు:ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు -డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడి వరం నియోజవర్గం ఐ.పోలవరం మండలం ఎదుర్లంక గ్రామంలో అమలాపురం పార్లమెంట్ సభ్యుడు గంటి హరీష్ బాలయోగి ఎంపీ ల్యాడ్స్ నిధులు రూ.1.06 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రభుత్వ విప్,ముమ్మిడివరం శాసనసభ్యుడు దాట్ల సుబ్బరాజు ఎంపీ గంటి హరీష్ బాలయోగితో కలిసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు గుత్తుల సాయి,ఐ.పోలవరం మండల టీడీపీ అధ్యక్షుడు సాగిరాజు సూరిబాబు రాజు,మాజీ శాసనసభ్యుడు చెల్లి వివేకానంద,కూటమి నాయకులు,కార్యకర్తలు,గ్రామ ప్రజలు,మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ ఎదుర్లంక గ్రామంలో రూ.1.06 కోట్లతో సీసీ రోడ్డు నిర్మాణం పూర్తికావడం సంతోషకరమన్నారు. ఎంపీగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధికి హరీష్ బాలయోగి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు.గ్రామ ప్రజల అవసరాన్ని గుర్తించి నిధులు కేటాయించిన ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు.ముమ్మిడివరం నియోజకవర్గ అభివృద్ధికి ఎంపీ సహకారం కొనసాగాలని ఆకాంక్షించారు.రాష్ట్ర ప్రభుత్వం,పార్లమెంట్ సభ్యులు,స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయంతో గ్రామాల్లో మౌలిక వసతులను మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.