తెలంగాణ

బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ..

బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ..

రుద్రూర్, పయనించే సూర్యుడు న్యూస్ : రుద్రూర్ మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద బి ఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం బిఆర్ఎస్ పార్టీ నాయకులు గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు వారి ఆశయ సాధన కోసం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ఇంఛార్జ్ గాండ్ల మధు, నాయకులు దౌర్ సాయిలు, కొత్తపల్లి రవికిరణ్, పార్వతి ప్రవీణ్, వంజరి సుమన్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS