సినిమా వార్తలు

భీంగల్‌లో ఇంటింటికి పండ్ల, పూల మొక్కల పంపిణీ.

భీంగల్‌లో ఇంటింటికి పండ్ల, పూల మొక్కల పంపిణీ.

పయనించే సూర్యుడుD.01.10.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్. భీంగల్: ప్రభుత్వ ఆదేశాల మేరకు వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా భీంగల్ పట్టణంలో గురువారం ఒకటి నుంచి ఆరో వార్డు వరకు ఇంటింటికి పండ్ల, పూల మొక్కలను పంపిణీ చేశారు. ఆయా వార్డు కౌన్సిలర్ల ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది, మెప్మా సిబ్బంది సమన్వయం తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.మున్సిపల్ చైర్‌పర్సన్ బోదిరే నాగమణి స్వామి ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒకటో వార్డు కౌన్సిలర్ ఆరేపల్లి శ్రీజ నాగేంద్రబాబు, రెండో వార్డు కుశలత అనంతరావు, మూడో వార్డు తోట సతీష్, నాలుగో వార్డు గున్నాల బాలలక్ష్మి, ఐదో వార్డు బోదిరే లావణ్య నర్సయ్య ఆధ్వర్యంలో ప్రజలకు మొక్కలను అందజేశారు.ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ వనమహోత్సవం ద్వారా పట్టణంలో పచ్చదనం పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. ప్రతి కుటుంబం తమ ఇంటి ఆవరణలో కనీసం ఒక మొక్కను నాటి, దానిని బాధ్యతగా సంరక్షించాలని కోరారు. మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటికి క్రమం తప్పకుండా నీరు పోసి పెంచినప్పుడే వనమహోత్సవ కార్యక్రమం లక్ష్యం నెరవేరుతుందని తెలిపారు.పండ్ల, పూల మొక్కలను ఇంటింటికీ అందించడం వల్ల ప్రజల్లో మొక్కల పెంపకంపై మరింత అవగాహన కలుగుతుందని, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ నరేందర్, వార్డు అధికారులు, మున్సిపల్ సిబ్బంది, మెప్మా సిబ్బంది, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS