సినిమా వార్తలు

గాంధీ జయంతి నాడు జోరుగా మద్యం విక్రయాలు?

గాంధీ జయంతి నాడు జోరుగా మద్యం విక్రయాలు?

పయనించే సూర్యుడు అక్టోబర్ 2 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు ప్రొహిబిషన్ అధికారుల అండదండలతోనే బ్లాక్ లో మద్యం విక్రాలు దందా ? -ప్రజల ఆరోపణలుతిరుపతి జిల్లా సూళ్లూరుపేట,అక్టోబర్ 2 : మహాత్మా గాంధీ జయంతి అంటే దేశమంతా మద్యం షాపులు మూసివేసి,మద్యపాన నిషేధం పాటిస్తారు.గాంధీజీ ఆశయాలను గౌరవిస్తారు. కానీ అందుకు విరుద్ధంగా సూళ్లూరుపేటలో మాత్రం గాంధీ జయంతి రోజు యథేచ్ఛగా మద్యం విక్రయాలు జోరుగా జరుగు తున్నాయి . అది కూడా ఎక్కడో కాదు,ఏకంగా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కి కొద్ది మీటర్ల దూరంలోనే, బహిరంగంగా!స్టేషన్ కి కూతవేటు దూరంలో ! బ్లాక్ లో మద్యం ఏరులై పారింది.పైకి మాత్రం మద్యం దుకాణాలు మూసి ఉన్నాయి. కానీ బెల్ట్ దుకాణాలకు ఎలా మద్యం తరలింది ? బ్లాక్ లో మద్యం ఏరులై పారింది. జిఎన్టి రోడ్డులో,కొన్ని బెల్ట్ షాపుల్లో, ఆటోల్లో,బైకుల్లో బహిరంగంగా మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని స్థానికులు విమర్శిస్తున్నారు. క్వార్టర్ మద్యం బాటిల్ రూ.150 ఉండేది రూ.250-300 వరకు అమ్మకాలు సాగుతున్నాయని పలువురు మందుబాబులు ఆరోపిస్తున్నారు.గాంధీ జయంతి రోజునే ఇంత బహిరంగంగా అమ్ముతుంటే,పోభూషన్ ఎక్సైజ్ పోలీసులు ఏం చేస్తున్నట్టు?స్థానికుల ఆరోపణ ప్రకారం ఇదంతా ప్రొహిబిషన్ సీఐ సురేంద్ర ప్రోత్సాహం లేకుండా జరగడం అసాధ్యం అంటు విమర్శలు.స్టేషన్ కి కూతవేటు దూరంలో జరుగుతున్న దందా సిఐ సురేంద్రకు తెలియదా ? ప్రొఫెషన్ స్టేషన్ నుంచి అడుగు బయట పెడితే కళ్లకు కనిపించే ఈమధ్యం దుకాణనికి ఆనుకొని ఉన్న బెల్ట్ దుకాణంలో అమ్మకాలు సాగుతున్నట్లు తెలియదాని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి ? ప్రొఫెషన్ అధికారుల మామూళ్ల కోసమే ఈ బ్లాక్ దందా అని ప్రజలు విమర్శిస్తున్నారు. గాంధీ జయంతి లాంటి పవిత్రమైన రోజు కూడా మద్యం అమ్మకాలను అడ్డుకోలేని ప్రొహిబిషన్ పోలీసులు శాఖ ఉన్నట్టా లేనట్టా ? వారి ఉనికికి అర్థం ఏముంది మందుబాబుల జేబులకు చిల్లు ! ప్రొహిబిషన్ అధికారులకు జోబుల్లోకి ముడుపుల మాయాజాలం ?సూళ్లూరుపేటలో లక్షల రూపాయల బ్లాక్ దందా బెల్ట్ దుకాణాల ముసుగులో అక్రమ మద్యం అమ్మకాలు జరిగాయని అంచనా. అధికారుల పాలకుల తీరు హాస్యాస్పదంగా ఉందని ప్రజల విమర్శలు?ఈ సంఘటనపై ఉన్నతాధికారులు స్పందించాలి తిరుపతి జిల్లా ఎస్పీ,ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు వెంటనే ఈ ఘటనపై విచారణ జరిపి,సూళ్లూరుపేట ప్రొహిబిషన్ సీఐ సురేంద్ర పై చర్యలు తీసుకోవాలని,గాంధీ జయంతి రోజున బహిరంగంగా మద్యం అమ్మిన వారిపై కేసులు నమోదు చేయాలని ప్రజాలు , స్థానికులు ప్రజా సంఘాలు, మహిళలు డిమాండ్ చేస్తున్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS