తెలంగాణ

కార్మిక సంఘాల ఐక్య వేదికతో కాంగ్రెస్ నేతల ప్రచారం

కార్మిక సంఘాల ఐక్య వేదికతో కాంగ్రెస్ నేతల ప్రచారం

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 2 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్‌పల్లి నియోజకవర్గంలోని కూకట్‌పల్లి ఆర్టీసీ డిపో వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులు కలిసి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్ నాయకత్వంలో, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచనల మేరకు కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈ ప్రచారం కొనసాగింది.కార్మిక సంఘాలైన తెలంగాణ వర్కర్స్ అసోసియేషన్, రాష్ట్ర రోడ్డు రవాణా కార్మిక సమాఖ్య, రాష్ట్ర కార్మిక సమాఖ్య ప్రతినిధులతో కలిసి నాయకులు డిపో వద్ద కార్మికులను కలుసుకుని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రతి కార్మికుడిని కలుపుకొని ముందుకు సాగాలని నాయకులు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలచారి, మాజీ శాసనమండలి సభ్యుడు రాములు నాయక్, డిపో అధ్యక్షులు, కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షులు డాక్టర్ పి. నాగిరెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా డిపోలో పనిచేస్తున్న పలువురు కార్మికులు ప్రచార కార్యక్రమంలో పాల్గొని నాయకులకు తమ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో హనుమంతరావు, అశోక్, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS