సినిమా వార్తలు

నాగేంద్రనగర్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు.

నాగేంద్రనగర్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు.

పయనించే సూర్యుడుD.02.10.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టికే గంగాధర్. ఏరుగట్ల మండలం లో నాగేంద్ర నగర్ గ్రామంలో శుక్రవారం గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ సందె రంజిత్ ఆధ్వర్యంలో గ్రామస్థులు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా గాంధీజీ సత్యం, అహింస, గ్రామ స్వరాజ్య ఆశయాలను స్మరించుకుని, వాటిని ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం నిర్వహించిన గ్రామసభలో బాల్య వివాహాలను అరికట్టడం, బాలికల విద్యను ప్రోత్సహించడం, నీటి వనరులను సంరక్షించడం, నీటి వృథాను నివారించడం వంటి అంశాలపై గ్రామస్థులు ప్రతిజ్ఞ చేశారు.కార్యక్రమంలో మిషన్ భగీరథ ఏఈ స్వరాజ్ , పంచాయతీ కార్యదర్శి ప్రియాంక, కారోబార్ జనార్దన్, మహిళా మండలి సీఏలు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, పంచాయతీ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS