
పయనించే సూర్యుడు,అక్టోబర్03( ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ): ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల్లో భాగంగా సేవా సంకల్ప్ అభియాన్,మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం టీ.కొత్తపల్లి ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు.ఆసుపత్రి పరిసరాలను శుభ్రపరిచి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బిజెపి అధ్యక్షులు అడబాల పాల్గొన్నారు మరియు బిజెపి మండల అధ్యక్షులు సఖి రెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముమ్మిడివరం మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గొల్ల కోటి వెంకటరెడ్డి,జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ, బిజెపి జిల్లా ఆఫీస్ ఇంచార్జ్ దాట్ల సుబ్బరాజు, చెరుకూరు గోపాలకృష్ణ( సిద్ధాంతి) జిల్లా కార్యవర్గ సభ్యులు రాయపురెడ్డి భైరవమూర్తి,వత్సవాయి రామకృష్ణరాజు,మండల యువమోర్చా అధ్యక్షులు రేవు సప్తఋషీశ్వర్,మద్దింశెట్టి రెడ్డినాయుడు,పోతుల కృష్ణ,గంధం ఈశ్వరరావు,నక్క రామకృష్ణ,దాసు,రమణ,సూరిబాబు పాల్గొన్నారు.ఆసుపత్రి అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని జిల్లా అధ్యక్షులు హామీ ఇచ్చారు.