తెలంగాణ

రాష్ట్ర స్థాయి జూనియర్, సబ్ జూనియర్ కబడ్డీ పోటీలకు గుడివెనుక తండా క్రీడాకారులు

రాష్ట్ర స్థాయి జూనియర్, సబ్ జూనియర్ కబడ్డీ పోటీలకు గుడివెనుక తండా క్రీడాకారులు

పయనించే సూర్యుడు గాంధారి 04/10/26 తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్, జూనియర్ బాల బాలీకల పోటిలకు మండలం లోని గుడివేనక తండా కు చెందిన క్రీడాకారులు ఎంపిక అయినట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు లక్ష్మణ్ రాథోడ్ తెలిపారు. గ్రామానికి చెందిన భూక్యా అర్జున్ జూనియర్ అండర్ 18 విభాగంలో, బానోత్ ఉష, నున్సవత్ అవంతిక సబ్ జూనియర్ అండర్ 16 Ordinary రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయ్యారు, ఈ నెల మూడు నుండి వేములవాడలో జరుగుతున్నా పోటీలో వీరు కామరెడ్డి జిల్లా కు ప్రాతినిధ్యం వహిస్తారు, ఉష బాన్స్వాడ కొయ్యగుట్ట కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుండగా అర్జున్ గాంధారి జూనియర్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అవంతిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పేట్ సంగంలో పదవ తరగతి చదువుతుంది, రాష్ట్ర స్థాయికి ఎంపిక అయినా క్రీడాకారులకు గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు యువకులు అభినందనలు తెలిపారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS