11 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఉత్సవాలు
ప్రతిరోజు నిత్య అన్న ప్రసాదం
గాంధారి, అక్టోబర్ 03: పయనించే సూర్యుడు గాంధారి గాంధారి మండల కేంద్రంలోని దుర్గానగర్ కాలనీలో ప్రతి ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించే శ్రీ దుర్గాదేవి 5వ వార్షికోత్సవ శుభ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. దుర్గాదేవి అమ్మవారి ఆలయంలో మాజీ సర్పంచ్ సంజీవ్ యాదవ్, ఉప సర్పంచ్ భాస్కర్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ రమేశ్, దుర్గానగర్ కాలనీవాసులు, దుర్గాయూత్ సభ్యులు, మండలంలోని వివిధ నాయకులు, జంగం నాగభూషణం అప్ప పాల్గొని ఆహ్వాన పత్రికను విడుదల చేశారు. బ్రహ్మశ్రీ జోషి సంతోష్ పురోహితుల చేతుల మీదుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటి రోజు నుంచి అమ్మవారికి రోజుకో అవతారంగా 11 రోజుల పాటు అలంకరణలు నిర్వహించి, ఆఖరి రోజున రాజరాజేశ్వరి అవతారంలో కన్నుల పండుగగా నిర్వహిస్తారని నిర్వాహకులు తెలిపారు. ప్రతిరోజూ మధ్యాహ్నం అన్నదానం, దాండియా కోలాటం, భగవద్గీత భక్తి ప్రవచనం, అల్పాహార కార్యక్రమాలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఆఖరి రోజు రాత్రి పూజలు అందుకున్న అమ్మవారి లడ్డూనువేలం వేయనున్నట్లు తెలిపారు.11వ రోజున కలశ ఉద్వాసన, శోభాయాత్ర, నిమజ్జనం ఉంటుందని తెలిపారు. గాంధారి మండల ప్రజలందరూ ఈ ఉత్సవాలకు హాజరై విజయవంతం చేయాలని దుర్గా నగర్ కాలనీ వాసులు, యూత్ సభ్యులు కోరారు.