పయనించే సూర్యుడు,అక్టోబర్03 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం,25ఏళ్ల ప్రజాసేవ సందర్భంగా సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా కె.గంగవరం మండలంలోని కె.గంగవరం, పామర్రు, సత్యవాడ హైస్కూల్స్ లో నిర్వహించిన వికసిత్ భారత్-2047 అంశంపై చిత్రలేఖనం, వక్తృత్వ పోటీల విజేతలకు బహుమతులు అంద జేశారు. ఈ సందర్భంగా సేవా సేతు జిల్లా కన్వీనర్ అవసరాల వెంకటరమణమూర్తి మాట్లాడుతూ సెప్టెంబర్17నుండి అక్టోబర్ 17 వరకు సేవా సంకల్ప్ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ పోటీలు నిర్వహించామన్నారు.13ఏళ్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా, 12ఏళ్లు ప్రధానిగా మోదీ అవినీతి రహిత పాలన అందిస్తూ స్వదేశీని ప్రోత్సహిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు కాదా వీరవెంకటరమణ, మండల బిజెపి అధ్యక్షుడు కొప్పిశెట్టి చంద్రరావు, మండల ప్రధాన కార్యదర్శి అవసరాల నారాయణమూర్తి, బివిబిఎల్ నారాయణ, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయిని లిల్లీ, విద్యార్థులు పాల్గొన్నారు.