రుద్రూర్, పయనించే సూర్యుడు న్యూస్ : బాన్సువాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, సిరిసిల్ల జిల్లా ప్రెసిడెంట్ తోట ఆగన్నను శనివారం బీఆర్ఎస్ పార్టీ రుద్రూర్ మండల ఇంచార్జ్ గాండ్ల మధు, నాయకులు బాజిరెడ్డి గోవన్న నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ బలోపేతం పై చర్చించారు. బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే అసలైన బలం అని, అధిష్టానం ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందన్నారు. బాజీరెడ్డిని కలిసిన వారిలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.