తెలంగాణ

(టిఆర్ఎస్ ) కవిత అక్క పార్టీలో చేరినందుకు పిప్రి కాలనీ చెందిన శంకర్ కు నేతాజీ యువజన సంఘం తరపున చిరు సన్మానం

(టిఆర్ఎస్ ) కవిత అక్క పార్టీలో చేరినందుకు పిప్రి కాలనీ చెందిన శంకర్ కు నేతాజీ యువజన సంఘం తరపున చిరు సన్మానం

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో భైంసా పట్టణంలోని పిప్రి కాలోని కి చెందిన శంకర్ కవిత అక్క టిఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా నేతాజీ యువజన సంఘం వారు చిరు సన్మానం అదేవిధంగా యువజన సంఘ సభ్యులు అందరూ కలిసి ఘనంగా సన్మానించారు. నేతాజీ యువజన సంఘం అధ్యక్షుడు సట్ల సాయినాథ్ మాట్లాడుతూ శంకర్ ఇంకా ఎన్నో విజయాలు పొందాలని అన్నారు అదేవిధంగా వేర్వేరు రాజకీయ పార్టీలకు చెందినప్పటికీ, నేతాజీ యువజన సంఘ సభ్యులుగా మనమందరం ఒక్కటే కుటుంబం. ఈ ఐక్యతకు నిదర్శనంగా అందరం కలిసి, మధ్యలో శాలువా ధరించిన శంకర్ టిఆర్ఎస్ కవిత పార్టీలోకి చేరిన సందర్భంగా హృదయపూర్వకంగా అభినందించాము. రాజకీయ అభిప్రాయాలు వేరైనా, మన మధ్య ఉన్న స్నేహం, ఆత్మీయత, అనుబంధం ఎప్పటికీ మారవు. పార్టీలు మారవచ్చు, కానీ మనసులు కలిసే ఉంటాయి. శంకర్ టిఆర్ఎస్ పార్టీలో మంచి భవిష్యత్తు, ఉన్నత పదవులు, ప్రజాసేవలో మరింత విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.నేతాజీ యువజన సంఘం ఐక్యత చిరస్థాయిగా నిలవాలి శంకర్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నేతాజీ యువజన సంఘం అధ్యక్షులు సట్ల సాయినాథ్, ఉపాధ్యక్షులు మామిడోళ్ల స్వామి, దోమకొండ రాజు, రవి పటేల్, లక్ష్మణ్, భోజన్న, చక్రపాణి, విట్టల్, కాండ్లి సాయినాథ్, రవి సిటీ కేబుల్ నేతాజీ యువజన సంఘ సభ్యులు పాల్గొన్నారు

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS