సినిమా వార్తలు

హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్టడీ మెటీరియల్స్ అందజేత …

హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్టడీ మెటీరియల్స్ అందజేత …

రుద్రూర్, పయనించే సూర్యుడు న్యూస్ : రుద్రూర్ మండల కేంద్రంలోని గ్రంథాలయ సంస్థ రీడింగ్ రూమ్‌లో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం రూ.70,000 విలువైన స్టడీ మెటీరియల్‌ను సోమవారం హైదరాబాద్‌కు చెందిన హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ కార్యక్రమం రుద్రూర్ గ్రామ సర్పంచ్ ఇందూర్ సునీత చంద్ర శేఖర్, పాలకవర్గం, రైడ్స్ పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతి రెడ్డి రాజారెడ్డి పాల్గొని విద్యార్థులను అభినందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయిలో ఎదగాలని సూచించారు. విద్యార్థుల కోసం స్టడీ మెటీరియల్ అందించిన హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ ప్రతినిధులు డా. హిమజా రెడ్డి, రవితేజ, ఇందూర్ మోడల్ స్కూల్ యజమాని కొడాలి కిషోర్, విద్యా వికాస్ శ్రీనివాస్, వంశీ స్కూల్ ప్రతినిధులు పద్మజ, విజయ్, విజయ సాయి ప్రతినిధి కృష్ణ మోహన్, స్థానిక వ్యాపారవేత్త బచ్చు రామ్, రైడ్స్ సంస్థ అసోసియేట్ అధ్యక్షులు మహాజన్ నర్సింలు, కార్యదర్శి పార్వతి శేఖర్, ఉప సర్పంచ్ షేక్ నిసార్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుఇందూర్ చంద్ర శేఖర్, కర్క అశోక్, వంజరి మోహన్, కవులాస్ గంగాధర్, ఇందూర్ కార్తీక్, ఓబుల సాయన్న, పార్వతి ప్రవీణ్, ఏముల గజేందర్, గాండ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS