తెలంగాణ

భీమ్‌గల్ ఎస్సై తిరుపతి వేధింపులే పోలస సుధాకర్ ఆత్మహత్యాయత్నానికి కారణం,

భీమ్‌గల్ ఎస్సై తిరుపతి వేధింపులే పోలస సుధాకర్ ఆత్మహత్యాయత్నానికి కారణం,

పయనించే సూర్యుడుD,05,10,2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్, భీమ్‌గల్ పోలీస్ స్టేషన్‌లో సుధాకర్ ఆత్మహత్యాయత్నం అత్యంత బాధాకరం పోలీసుల ఖాకీ ఆగడాలకు అడ్డేది? – ఎస్సై తిరుపతిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి డిస్మిస్ చేయాలి బాల్కొండ నియోజకవర్గం మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇప్పటికే హోప్ హాస్పిటల్ లో వైద్యానికి అతనికి 80,000 ఖర్చు అయ్యింది నావంతు 50,000 సహాయం అందిస్తున్నాను.బాధితుడు పొలాస సుధాకర్‌ వైద్యానికి అయ్యే ఖర్చు మొత్తం ప్రభత్వమే భరించాలి భీమ్‌గల్, బాల్కొండ, మోర్తాడ్ ఎస్సైల అరాచకాలపై కమిషనర్‌కు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం అధికార దుర్వినియోగం, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఎస్సైలపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి: సీపీకి ఎమ్మెల్యే వేముల డిమాండ్ బాల్కొండ నియోజకవర్గంలో మితిమీరిన పోలీసుల దౌర్జన్యాలు – చర్యలు తీసుకోకపోతే ప్రజా ఆందోళన తప్పదు పోలస సుధాకర్ ఆత్మహత్య యత్నంలో పోలీసులు ప్రమేయం ఏమి లేదు అని సీపీ అనడం పూర్తిగా బాధ్యత రహిత్యం సీపీ వివరణకు నిరసనగ రేపు భీంగల్ బంద్ కు పిలుపు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి భీంగల్ / బాల్కొండ నియోజకవర్గం : భీమ్‌గల్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సై తిరుపతి వేధింపులు తాళలేక నిరుపేద వెనుకబడిన తరగతికి చెందిన పొలాస సుధాకర్ అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం అత్యంత బాధాకరమని, దురదృష్టకరమని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు పక్కన టీస్టాల్ నడుపుకుంటూ జీవనం సాగించే ఒక సామాన్యున్ని పోలీసు అధికారి ప్రాణాల మీదికి తెచ్చే స్థాయికి వేధించడం గర్హనీయమని మండిపడ్డారు.భీమ్‌గల్ ఎస్సై తిరుపతి విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేయడం, అక్రమ ఇసుక వ్యాపారులతో చేతులు కలిపి దందాలు నడపడం, అమాయకులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి చితకబాది బూతులు తిడుతూ దౌర్జన్యాలు చేయడం నిత్యకృత్యంగా మార్చుకున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ అరాచకాలపై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ (సీపీ) దృష్టికి గతంలోనే పలుమార్లు తీసుకెళ్లినప్పటికీ, ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే మరింత బరితెగించి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఫలితంగానే నేడు నిండు ప్రాణం బలిపీఠం ఎక్కే పరిస్థితి తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఆత్మహత్యాయత్నంలో తీవ్రంగా గాయపడిన పోలస సుధాకర్‌ను మొదట నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ‘హోప్ ఆసుపత్రి’కి తరలించి వైద్యం అందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితిపై ప్రతి అరగంటకోసారి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు, యాజమాన్యంతో నిరంతరం సమీక్షిస్తున్నానని చెప్పారు.ఇప్పటికే హోప్ హాస్పిటల్ లో వైద్యానికి అతనికి 80,000 ఖర్చు అయ్యింది.50,000 రూపాయల సహాయం వైద్య ఖర్చుల కోసం ఎమ్మెల్యే ప్రకటించారు.తదుపరి వైద్యఖర్చుల మొత్తం ప్రభుత్వము పోలీసులే భరించాలని డిమాండ్ చేసారు.పోలస సుధాకర్ ఆత్మహత్యయత్నం విషయంలో పోలీస్ లది ఎలాంటి ప్రమేయం లేదని జిల్లా సీపీ మాట్లాడటం పూర్తిగా బాధ్యతరహిత్యం అని ఎమ్మెల్యే అన్నారు. బాధితుడు పోల సుధాకర్ హాస్పిటల్ లో మీడియాతో మాట్లాడుతూ భీంగల్ SI తిరుపతి , కానిస్టేబుల్ లు ఇద్దరు తనను తరుచు వేదిస్తూ న్నారు అని అంత క్లియర్ గా చెప్పిన తరువాత కుడా సీపీ ఇందులో ఎస్. ఐ, పోలీసుల ప్రమేయం లేదు అనడం సీపీ బాధ్యత రాహిత్యమని నిరసనగా , వెంటనే SI తిరుపతి పై కఠిన చర్యలు తీసుకోవాలని అతన్ని అరెస్ట్ చేసి ఉద్యోగం నుండి వెంటనే డిస్మిస్ చేయాలనీ డిమాండ్ చేస్తూ రేపు భీంగల్ బందు కి పిలుపునిచ్చారు.ఈ బంద్ కి భీంగల్ ప్రజలు, వ్యాపార వర్గాలు స్వచ్చదంగా సహకరించాలని ఎమ్మెల్యే కోరారు .బాల్కొండ నియోజకవర్గంలో పోలీసుల ఆగడాలు మితిమీరిపోయాయని ఎమ్మెల్యే వేముల ఆరోపించారు.భీమ్‌గల్ ఎస్సై తిరుపతి: అక్రమ ఇసుక దందాలు, సామాన్యులపై దౌర్జన్యాలు, బెదిరింపులు.బాల్కొండ ఎస్సై శైలేందర్: అక్రమ వసూళ్లు, సెటిల్‌మెంట్లు చేయడం పరిపాటిగా మారాయని, దీనిపై సీపీకి ఫిర్యాదు చేసినా చర్యలు లేవని పేర్కొన్నారు.మోర్తాడ్ ఎస్సై రాము: ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం, స్టేషన్‌కు పిలిపించి బెదిరింపులకు దిగడం నిత్యకృత్యమైందన్నారు. ఇటీవల దళిత వర్గానికి చెందిన గందం మహిపాల్ అనే వ్యక్తిని స్టేషన్‌లో చితకబాదడంతో బాధితుడు మానవ హక్కుల కమిషన్ (HRC), ఎస్సీ కమిషన్‌తో పాటు పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని గుర్తుచేశారు.పోలీసు వ్యవస్థ పరిధి దాటి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ సామాన్యులను వేధిస్తున్న ఈ ముగ్గురు ఎస్సైలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్‌ను డిమాండ్ చేశారు.ముఖ్యంగా:పొలాస సుధాకర్‌ను చావు అంచుల దాకా నెట్టిన భీమ్‌గల్ ఎస్సై తిరుపతిపై తక్షణమే హత్యాయత్నం కేసు నమోదు చేయాలి.ఎస్సై తిరుపతిని వెంటనే అరెస్ట్ చేసి, సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలి.పోల సుధాకర్ కు ప్రభుత్వ ఖర్చులతో మెరుగైన వైద్యం అందించాలి. పొలాస సుధాకర్‌కు ఏమైనా ప్రాణాపాయం జరిగితే దానికి రాష్ట్ర ప్రభుత్వం, నిజామాబాద్ జిల్లా పోలీస్ యంత్రాంగం, ఎస్సై తిరుపతే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికైనా పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి బాధితుడికి న్యాయం చేయాలని, లేనిపక్షంలో భీమ్‌గల్ ప్రజలు ఇప్పటికే ఉద్యమబాట పడుతున్నారని, ప్రజాగ్రహం తప్పదని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS