తెలంగాణ

ఐమాక్స్ లైట్లకు భూమిపూజ చేసిన బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి

ఐమాక్స్ లైట్లకు భూమిపూజ చేసిన బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి

పయనించే సూర్యుడు అక్టోబర్8 నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలోని అవసలోని పల్లె, బిజ్వార్, పులుమామిడి, పెద్దాపురం గ్రామాల్లో ఐమాక్స్ లైట్ల ఏర్పాటుకు బీజేపీ నాయకుడు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి గురువారం భూమిపూజ నిర్వహించారు.ఈ సందర్భంగా బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసి పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా గీతా సెల్ కన్వీనర్ బి. విజయనగౌడ్, జయసింహారెడ్డి, ఆంజనేయులు, బిజ్వార్ సర్పంచ్ అంజప్ప, మొగ్ధంపూర్ సర్పంచ్ తిరుమలేష్, కొత్తపల్లి సర్పంచ్ నర్సింహులు, పెద్దాపురం గ్రామ సర్పంచ్, అవసలోని పల్లె కురుమయ్య, బిజ్వార్ రాజప్ప, బిజ్వార్ వెంకటప్ప, పులుమామిడి మాజీ ఎంపీటీసీ శ్రీనివాసులు, బీజేపీ వార్డు సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS