ఆంధ్రప్రదేశ్

ఏ పి.వి.ఆర్.ఎ.సంఘాల జాయింట్ యాక్షన్ కమిటి బిజెపి కొత్తపేట ఇన్చార్జి పాలూరికి వినతిపత్రం సమర్పణ

ఏ పి.వి.ఆర్.ఎ.సంఘాల జాయింట్ యాక్షన్ కమిటి బిజెపి కొత్తపేట ఇన్చార్జి పాలూరికి వినతిపత్రం సమర్పణ

పయనించే సూర్యుడు అక్టోబర్ 8 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీబిజెపి కొత్తపేట నియోజకవర్గ ఇన్చార్జి పాలూరి సత్యానందం గత 23 రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్న వి.ఆర్.ఏ లను కొత్తపేట పాత బస్టాండ్ సెంటర్లో కలిసి వారి సమస్యలు తెలుసుకొన్నారు.ఈ సందర్భంగా వి.ఆర్.ఏలు మాట్లాడుతూ గ్రామ రెవెన్యూ సహాయకులకు పేస్కేలు అమలు చేయాలని, నామినీలుగా పనిచేస్తున్న వారిని వీ.ఆర్.ఏ లుగా నియమించాలని కోరుతూ…ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి 13 జిల్లాల్లో సుమారు 20వేల మందికి పైగా రెవెన్యూ వ్యవస్థలో, గ్రామస్థాయిలో గ్రామ రెవెన్యూ సహాయకులు పనిచేస్తున్నారు. వీరికి కేవలం 10500 /- రూ మాత్రమే వేతనం వస్తున్నది. 2018 సంవత్సరంలో ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి హయాంలో 10,500 వేతనం పెరిగింది. అప్పటినుండి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా వేతనం పెరగలేదు. గత ప్రభుత్వంలో వి.ఆర్,ఏలు తీవ్రమైన నిర్లక్ష్యానికి గురైనారు. 10,500 వేతనంతో వీఆర్,ఏ ల కుటుంబాలు భ్రతకడం నేటి పరిస్థితుల్లో కష్టదాయకమని అన్నారుకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండు సంవత్సరాల కాలంలో వీఆర్ ఏల సమస్యలను ప్రభుత్వం. దృష్టికి అనేకసార్లు తీసుకుకావడం జరిగింది. అయినా మా సమస్యలు నేటి వరకు పరిష్కారం కాలేదు. దీంతో విఆర్ఎ ల లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నది. వీఆర్ ఏలు అందరూ గ్రామీణ ప్రాంతాలలో బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారు, కావున మాన్యాయమైన సమస్యను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా రెగ్యులర్ చేసి పే స్కేట్ అమలు చేయాలని. కోరుచున్నాము. అదేవిధంగా నామినీలుగా పనిచేస్తున్న వారందరినీ వన్ టైం సెటిల్మెంట్గా వీఆర్ ఏలుగా నియమించాలని, అందరికీ 70% ప్రమోషన్ కల్పించాలని, వీఆర్ ఏలుగా పనిచేసి మరణించిన కుటుంబాలలో అర్హులకు కారుణ్యనియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని విజ్ఞప్తి చేసారు.వీఆర్ ఏలు అనేక రకాలుగా విధులు అనగా రీసెర్వేలు, ఎన్నికల విధులు,భూమిశిస్తులు కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత కార్యాలయంలో వాచ్మెన్ డ్యూటీలు చేస్తూ అనేక రకాలుగా ఇబ్బందులు. పడు తున్నారు. వీటిని కూడా ఒకసారి పరిశీలించి అదనపు డ్యూటీ నుండి మినహాయింపు ఇవ్వాలని కోరు తున్నామన్నారు. పాలూరి మాట్లాడుతూ మీ సమస్యలు అన్నీ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు పి.వి.ఎన్ మాధవ్ గారికి , రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి తెలియజేసి వారిద్వారా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు , పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన మీ సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తానని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో బిజెపి యువమోర్చ జిల్లా ఉపాధ్యక్షుడు కోటిపల్లి దామోదర్ వీ.ఆర్ ఏలు తదితరులు పాల్గొన్నారు

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS