సినిమా వార్తలు

మురమళ్లలో ఘనంగా సేవా జ్యోతి యాత్ర – మోదీ సేవా ప్రస్థానానికి ఎమ్మెల్యే బుచ్చిబాబు నేతృత్వంలో సంఘీభావం

మురమళ్లలో ఘనంగా సేవా జ్యోతి యాత్ర – మోదీ సేవా ప్రస్థానానికి ఎమ్మెల్యే బుచ్చిబాబు నేతృత్వంలో సంఘీభావం

పయనించే సూర్యుడు అక్టోబర్ 8 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ఘనంగా సేవా జ్యోతి యాత్ర నిర్వహించారు. మురమళ్లలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వాధినేతగా 25 సంవత్సరాల ప్రజా సేవా ప్రస్థానాన్ని పూర్తిచేసుకున్న సందర్భంగా శాసనసభ విప్, ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) ఆధ్వర్యంలో సేవా జ్యోతి యాత్ర ఘనంగా నిర్వహించారు. మురమళ్ల క్యాంపు కార్యాలయం నుంచి మార్కెట్ సెంటర్ వరకు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ర్యాలీగా పాల్గొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ, ప్రజా జీవితంలోకి ప్రవేశించి సుమారు 25 సంవత్సరాలుగా దేశ ప్రజలకు విశేష సేవలు అందిస్తున్న నరేంద్ర మోదీ నాయకత్వం దేశానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా వివిధ బాధ్యతలు నిర్వహిస్తూ దేశ అభివృద్ధి, సంక్షేమం, మౌలిక వసతుల కల్పనకు ఆయన విశేష కృషి చేశారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందిస్తున్న సహాయ సహకారాలు ఎంతో కీలకమని ఎమ్మెల్యే తెలిపారు. రానున్న రోజుల్లో కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని, ముమ్మిడివరం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి, రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు చెల్లి అశోక్, టేకుమూడి లక్ష్మణరావు, సాక సీత దేవి, బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెంకటరెడ్డి, సీనియర్ బీజేపీ నాయకులు గంధి నానాజీ, జనసేన నాయకులు గుద్దిటి రమా కేశవ బాలకృష్ణ(జిమ్మీ) దుర్గాప్రసాద్, ఐ పోలవరం, తాళ్లరేవు, కాట్రేనికోన మండలాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సాగిరాజు సూరిబాబు రాజు, ధూళిపూడి వెంకటరమణ (బాబి), చెల్లి సురేష్, నాయకులు కాశి లాజర్, కార్యకర్తలు, అభిమానులు, పెద్ద సంఖ్యలో పాల్గొని సేవా జ్యోతి యాత్రను విజయవంతం చేశారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS