పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 9 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా ఎస్సీ డిపార్ట్‌మెంట్ జనరల్ సెక్రటరీగా నియమితులైన జెల్ల శివకుమార్ కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం శ్రీ హేమ దుర్గా భవన్ లో నియామక పత్రాన్ని అందుకున్నారు.టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మరియు కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ బండి రమేష్ ఆధ్వర్యంలో, బండి రమేష్ సమక్షంలో జెల్ల శివకుమార్ అపాయింట్‌మెంట్ ఆర్డర్‌ను స్వీకరించారు.ఈ సందర్భంగా బండి రమేష్ జెల్ల శివకుమార్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ఎస్సీ వర్గాల అభ్యున్నతికి అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య, ప్రసన్నకుమార్, రమణ, బర్కత్ అలీ,రమాదేవి తదితరులు పాల్గొన్నారు.