పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 15 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి భారతదేశ మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ జయంతిని పురస్కరించుకుని కూకట్పల్లి నియోజకవర్గం లోని భరత్ నగర్ కాలనీలో ఘనంగా నివాళులర్పించారు. భరత్ నగర్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు డాక్టర్ పి. నాగిరెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఉదయం సంక్షేమ సంఘం కార్యాలయం వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశాభివృద్ధికి, శాస్త్ర సాంకేతిక రంగాల పురోగతికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. సామాన్య కుటుంబంలో జన్మించి, తన కృషి, పట్టుదల, క్రమశిక్షణతో దేశ అత్యున్నత పదవిని అధిరోహించిన కలామ్ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా సంక్షేమ సంఘం అధ్యక్షుడు డాక్టర్ పి. నాగిరెడ్డి మాట్లాడుతూ, డాక్టర్ అబ్దుల్ కలామ్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా దేశానికి విశేష సేవలందించిన ఆయన జీవితం యువతకు ఆదర్శ ప్రాయమని పేర్కొన్నారు. విద్యార్థులు, యువత ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని, కష్టపడి చదివి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. సమాజానికి సేవ చేయడం ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందని, ప్రతి ఒక్కరూ తమ వంతుగా సమాజ సేవకు కృషి చేయాలని అన్నారు.అబ్దుల్ కలామ్ ఆశయాలను స్మరించుకుంటూ, ఆయన చూపిన మార్గంలో నడవడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు సూర్యనారాయణ మూర్తి, నాగేశ్వర్ రావు, అబ్బజల్ పాషా, బాబు, డేవిడ్, శ్రీనివాస్ గౌడ్, వెంకటేష్ యాదవ్, రాంబాబు, వెంకటేష్, నరేష్ కుమార్, మధు, సంతోష్ కుమార్ తదితరులు పాల్గొని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్కు నివాళులర్పించారు.