పయనించే సూర్యుడు అక్టోబరు 7 ముమ్మిడివరం ప్రతినిధి ముమ్మిడివరం – డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కోటిపల్లి మాజీ సర్పంచ్, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్రీ చిట్టిబాబు జన్మదినం సందర్భంగా ముమ్మిడివరం నియోజకవర్గ నాయకులు ఆయనను ఘనంగా సత్కరించారు. జన్మదినం పురస్కరించుకుని శాలువాతో సత్కరించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కోసం చిట్టిబాబు చేస్తున్న సేవలు అభినందనీయమని, ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని, ప్రజా సేవలో మరింత ముందుకు సాగాలని నాయకులు ఆకాంక్షించారు. ఆయనకు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కోశాధికారి గ్రంధి నానాజీ, ముమ్మిడివరం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గొలకోటి వెంకటరెడ్డి, జిల్లా సేవా సంకల్ప్ అభియాన్ కన్వీనర్ నాగిరెడ్డి సతీష్ రావు తదితరులు పాల్గొన్నారు.