పయనించే సూర్యుడు గాంధారి 14/10/26 ఒకేసారి రెండు జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై చరిత్ర సృష్టించారు మారుమూల గిరి పల్లె గుడి వెనుక తండ నిరుపేద కుటుంబానికి చెందిన భానోత్ ఉష, వివరాల్లోకెళ్తే గ్రామానికి చెందిన బానోత్ విట్టల్ మంగథీ బాయి ల కుమార్తె బానోతు ఉష జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు అభ్యసించింది ఇంటర్మీడియట్ కొయ్యగుట్ట జూనియర్ కాలేజ్ లో విద్యను అభ్యసిస్తున్న ఉష ఇటీవల రెండో 2 తేదీ నుంచి 5వ తేదీ వరకు వేములవాడలో జరిగిన సబ్ జూనియర్ బాలికల కబడ్డీ పోటీలో కామారెడ్డి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన అద్భుత ప్రదర్శన చేసి జిల్లా జట్టును క్వార్టర్ ఫైనల్ వరకు తీసుకెళ్లింది ఉష ఆట ప్రదర్శనలు చూసిన అధికారులు ఆమెను జాతీయస్థాయి సబ్ జూనియర్ పోటీలకు ఎంపిక చేసినట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు లక్ష్మణ రాతోడ్ తెలిపారు. అదేవిధంగా ఇదే నెల 9 నుంచి 12 వరకు ఖమ్మం జిల్లాలోని అశ్వరావుపేటలో జరిగిన జూనియర్ కబడ్డీ పోటీల్లో మరోసారి కామారెడ్డి నుండి ప్రాతినిధ్య వహించిన ఉష ప్రదర్శన అద్భుతంగా ఉండటంతో హామీను జాతీయ సైజు జట్టుకి ఎంపిక చేసినట్లు ఆయన సూచించారు ఎంపికైన ఉష ను కబడ్డీ అసోసియేషన్ కామారెడ్డి జిల్లా బాధ్యులు భాస్కర్ రెడ్డి రాజన్న కళాశాల ప్రిన్సిపల్ కమల భాయి పిడి సరళ, జానకి గ్రామస్తులు గ్రామ యువకులు ప్రజా ప్రతినిధులు ప్రత్యేకంగా అభినందించారు.